Advertisement

మద్యం బాటిళ్లతో పట్టుబడ్డ సినీనటి రమ్యకృష్ణ

By: chandrasekar Mon, 15 June 2020 3:05 PM

మద్యం బాటిళ్లతో పట్టుబడ్డ సినీనటి రమ్యకృష్ణ


ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ కారు మద్యం సీసాలతో చెన్నైలో పట్టుబడింది. లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో మద్యం అక్రమ సరఫరా అనుమానాలతో తమిళనాడు పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా వెలుగుచూసింది. ఇదే సందర్బంలో నటి రమ్యకృష్ణ కారును కూడా చెక్‌ చేశారు. చెన్నై సమీపంలోని ముత్తుకాడు చెక్‌పోస్ట్‌ దగ్గర జరుగుతున్న తనఖీల సందర్బంగా రమ్యకృష్ణ కారు మద్యం బాటిళ్లతో పట్టుబడింది. తనిఖీలు జరుగుతున్న సమయంలో రమ్యకృష్ణ, ఆమె సోదరి వినయాకృష్ణన్‌ కూడా కారులోనే ఉన్నట్లు తెలియవచ్చింది.

పుదుచ్చేరి నుంచి చెన్నైకు అక్రమంగా మద్యం తరలిస్తున్న రమ్యకృష్ణ కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని వాహనాలను చెక్ చేస్తున్న సమయంలోనే రమ్యకృష్ణ కారు కూడా వచ్చింది. పోలీసులు చెక్ చేస్తున్న సమయంలో అందులో భారీగా మద్యం ఉండటంతో కారును వెంటనే సీజ్ చేసారు. తనిఖీ సందర్బంగా కారులో వందకుపైగా మద్యం బాటిళ్లు దొరికాయని పోలీసులు తెలిపారు. రమ్యకృష్ణ, ఆమె సోదరి వినయాకృష్ణన్‌లు సెల్వకుమార్‌ను అరెస్టు చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. పట్టుబడ్డ మద్యంబాటిళ్లలో 96 బీరు సీసాలు కాగా, 8 ఇతర మద్యం సీసాలున్నాయని పోలీసులు వెల్లడించారు.

Tags :
|

Advertisement