Advertisement

  • నెగటివ్ ట్రోల్స్ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళాను..బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్

నెగటివ్ ట్రోల్స్ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళాను..బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్

By: Sankar Mon, 21 Sept 2020 4:25 PM

నెగటివ్ ట్రోల్స్ చూసి డిప్రెషన్ లోకి వెళ్ళాను..బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్


నటి వితిక షేరు తన భర్త నటుడు వరుణ్ సందేశ్ తో కలిసి గతంలో బిగ్ బాస్ షో లో పార్టీసిపెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో బిగ్ బాస్ నుండి వచ్చిన తరువాత ఎదురైన అనుభవాలను పంచుకుంది.

బిగ్ బాస్ షో లో తాను ధైర్యంగా ఉండేదనినని కానీ భయటకు వచ్చాక ట్రోల్స్ చూసి డిప్రెషన్ లోకి వెళ్లినట్టు చెప్పింది. హౌస్ లోకి వెళ్ళాక అంతకుముందు తనతో స్నేహంగా ఉన్నవారు కూడా సపోర్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై చాలా నెగిటివ్ గా ట్రోల్స్ చేసారని కుటుంబ సభ్యలు ఎంత బాధ పడ్డారో అని ఆలోచించి భాధ పడ్డానని తెలిపింది. వచ్చిన తరువాత తన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి భయపడ్డానని చెప్పింది.

ఎలాంటి కామెంట్స్ పెడతారో అని భయపడేదానినని వెల్లడించారు. దాంతో డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చింది. క్యాన్సర్, ఎయిడ్స్ కంటే డిప్రెషన్ ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ఆ డిప్రెషన్ నుండి భయట పడటానికి తన కుటుంబం ఎంతో సహకరించిందని తెలిపింది.

Tags :
|

Advertisement