Advertisement

భారీగానే ఆస్తులు కూడబెట్టిన నటి సంజనా

By: chandrasekar Wed, 16 Sept 2020 3:46 PM

భారీగానే ఆస్తులు కూడబెట్టిన నటి సంజనా


బుజ్జిగాడు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను పరిచయమైంది క‌న్న‌డ నటి సంజ‌నా గ‌ల్రాని. ఆ త‌ర్వాత స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఆశించిన స‌క్సెస్ కాలేదు. క‌ర్ణాట‌క‌లో క‌ల‌క‌లం సృష్ణించిన డ్ర‌గ్స్ కేసులో సంజ‌నాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే పోలీసుల విచార‌ణ‌లో కాస్త ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యాలు బ‌య‌టకు వచ్చాయట‌. కెరీర్ లో పెద్ద‌గా స‌క్సెస్ లేని సంజ‌నా పేరు మీద బెంగ‌ళూరులో 10 ప్లాట్లున్న‌ట్టు పోలీసులు గుర్తించిన‌ట్టు టాక్.

సినిమాల ద్వారా అంత‌గా ఆదాయం లేని సంజ‌నాకు ఇన్నీ ఆస్తులు ఎలా వచ్చాయ‌నే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు కోనసాగిస్తున్నారు. బ‌డా బాబుల అండ‌తో డ్ర‌గ్స్ అమ్మ‌కాల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఇన్ని ఆస్తులు ఏర్పరుచుకుందా అని అనుమానిస్తున్నారు పోలీసులు. మ‌రి సంజ‌నా వెనుక ఉన్న ఆ పెద్దలు ఎవరో తెలియాల్సి ఉంది.

Tags :
|

Advertisement