Advertisement

  • ‘ఫండ్‌ రైజింగ్‌'కు పిలుపునిచ్చిన నటి అవికా గోర్

‘ఫండ్‌ రైజింగ్‌'కు పిలుపునిచ్చిన నటి అవికా గోర్

By: chandrasekar Thu, 16 July 2020 1:09 PM

‘ఫండ్‌ రైజింగ్‌'కు పిలుపునిచ్చిన నటి అవికా గోర్


బుల్లితెరకు ‘చిన్నారి పెళ్లికూతురు’గా పరిచయమై వేలమంది అభిమానులను సంపాదించుకున్నది అవికా గోర్‌. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి ‘ఉయ్యాల జంపాలా’ అంటూ ఎంట్రీ ఇచ్చి, యూత్‌ గుండెల్లో ఊయలలూగింది.

ఇప్పుడు ‘బాలికా విద్య’ కోసం కృషి చేస్తూ పెద్ద మనసును చాటుతున్నది. దేశంలో అనేక మంది బాలికలకు సరైన విద్య అందడం లేదు. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో లింగవివక్షత, ఆర్థిక అంశాలు అమ్మాయిల చదువుపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ క్రమంలో ‘క్యాంప్‌ డైరీస్‌' అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి నటి అవికా గోర్‌, ‘బాలికా విద్య’ కోసం కృషి చేస్తున్నది. ఇటీవలే తన పుట్టిన రోజును పురస్కరించుకొని ‘ఫండ్‌ రైజింగ్‌'కు పిలుపునిచ్చింది. తన

బర్త్‌ డే సందర్భంగా ఎలాంటి గిఫ్ట్‌లు పంపవద్దనీ, వేడుకలను నిర్వహించవద్దని అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులను కోరింది. బదులుగా బాలికల చదువు కోసం స్వచ్ఛందంగా విరాళాలు పంపాలని విన్నవించింది. ‘ఫండ్‌ రైజింగ్‌'కు విశేష స్పందన లభించింది.

అభిమానులు, సన్నిహితులతోపాటు కుటుంబ సభ్యుల నుంచి కూడా భారీగా డొనేషన్లు వచ్చాయి. ఈ విరాళాలలో మూడు వేల మంది బాలికలకు సరైన విద్య అందించవచ్చునని అవికా అంటున్నది. అమ్మాయిలు, అబ్బాయిలను వేరుచేసి చూడవద్దనీ, బాలికలను చదువులో ప్రోత్సహిస్తే ఉన్నతంగా రాణిస్తారని చెబుతున్నది.

Tags :
|

Advertisement