Advertisement

  • నేపోటిజం వ్యాఖ్యలతో నన్ను పెద్ద స్టార్ ను చేసారు..చుంకి పాండే

నేపోటిజం వ్యాఖ్యలతో నన్ను పెద్ద స్టార్ ను చేసారు..చుంకి పాండే

By: Sankar Thu, 27 Aug 2020 7:32 PM

నేపోటిజం వ్యాఖ్యలతో నన్ను పెద్ద స్టార్ ను చేసారు..చుంకి పాండే


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం తర్వాత బి టౌన్ లో నేపోటిజం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి..దీనిలో భాగంగా స్టార్స్ వారసుల సినిమాల మీద ప్రేక్షకులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు..ఇటీవల అలియా భట్ నటించిన సడక్ 2 ట్రైలర్ తీవ్ర స్థాయిలో డిస్ లైక్స్ వచ్చాయి..ఇప్పుడు అనన్య పాండే-ఇషాన్ ఖ‌ట్ట‌ర్ న‌టించిన ఖాళి పీలి చిత్రం ఇటీవ‌లే విడుద‌లైంది.

ఈ సినిమా టీజ‌ర్ కు 4,2 మిలియ‌న్ల వ్యూస్ తోపాటు 102 లైక్స్, 1.1 మిలియ‌న్ల డిస్ లైక్స్ వ‌చ్చాయి. యాంటీ నెపోటిజ‌మ్ గ్యాంగ్ నుంచి ఈ సినిమాపై సెటైర్స్ పేలాయి. దీనిపై అన‌న్యపాండే తండ్రి, సీనియ‌ర్ యాక్ట‌ర్ చుంకీ పాండే ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ...యాంటీ నెపోటిజ‌మ్ గ్యాంగ్ నా కూతురిని స్టార్ కిడ్ గా పేర్కొన‌డం మొట్ట‌మొద‌ట నాకు సంతోషం క‌లిగించే అంశం. ఎందుకంటే వారి కామెంట్లు నన్ను పెద్ద స్టార్ గా అభివ‌ర్ణించాయి అంటూ న‌వ్వారు.

త‌న కూతురు అన‌న్య‌పాండేకు త‌న రిక‌మండేష‌న్ తో తొలి చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్-2.. క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో న‌టించే అవ‌కాశం రాలేద‌ని, టాలెంట్ తోనే ఆ ఛాన్స్ వ‌చ్చింద‌ని చుంకీ పాండే చెప్పుకొచ్చాడు. కెరీర్ తొలినాళ్ల‌లో చుంకీ పాండే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ త‌ర్వాత మంచి పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.

Tags :
|

Advertisement