Advertisement

  • గంజాయి మాఫియా ముఠాలతో సంబంధాలున్న పోలీసు శాఖలోని కొంతమందిపై చర్యలు

గంజాయి మాఫియా ముఠాలతో సంబంధాలున్న పోలీసు శాఖలోని కొంతమందిపై చర్యలు

By: chandrasekar Mon, 07 Sept 2020 10:07 AM

గంజాయి మాఫియా ముఠాలతో సంబంధాలున్న పోలీసు శాఖలోని కొంతమందిపై చర్యలు


బాధ్యతగా ఉండాల్సింది పోయి మామూళ్ల మత్తులో జోగుతున్న పోలీసు శాఖలోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కసరత్తు చేస్తున్నారు. గంజాయి ముఠాలకు పోలీసు శాఖలో ఎవరు సహకరిస్తున్నారనే కోణంలో విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. విచారణ అనంతరం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని సీపీ భావిస్తున్నట్లు సమాచారం. కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన పోలీసు అధికారులు గత ప్రభుత్వ పాలనలో అడ్డదారుల్లో పయనించి, అక్రమార్జనే ధ్యేయంగా పనిచేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన కొందరు ఇప్పటికీ అదేరీతిలో భక్షకులై చెలరేగిపోతున్నారు. నానా తంటాలు పడి పోస్టింగ్‌ తెచ్చుకున్నాం. ‘ఇప్పుడు కాక మరెప్పుడు..’ సంపాదించుకోవాలనే తరహాలో రీతిలో దందాలు, దోపిడీ మార్గంలో ఉరకలేస్తున్నారు. ఇలా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. ఏకంగా పోలీసు కమిషనరేట్‌లోనే అక్రమాలకు తెరలేపారు.

స్టేషన్‌లకు వచ్చే కేసులనే ఆదాయ వనరులుగా మార్చుకుని దోపిడీకి బరితెగిస్తున్న పోలీసు శాఖలోని పలువురి అధికారులపై పోలీసు బాస్‌ సీరియస్‌గా ఉన్నారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, వైట్‌ కాలర్‌ పంచాయతీలను చక్కబెట్టడానికి.. గుట్టుచప్పుడు కాకుండా వాటాలను అందజేయానికి అడ్డదారిలో వెళ్తున్న అధికారులు ప్రత్యేకంగా సిబ్బందిలో ఒకరిద్దరిని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. విజయవాడ నగరం వ్యవస్థీకత నేరాలకు అడ్డాగా మారింది. ఇక్కడ నిత్యం భూకబ్జాలు, సివిల్‌ తగాదాలు, జీరో వ్యాపారం, కాల్‌మనీ, గంజాయి వంటి కేసులతో కొన్ని పోలీసు స్టేషన్లు నిత్యం కిటకిటలాడుతుంటాయి. ఇదే కొందరు పోలీసులకు ఆదాయ వనరుగా మారింది. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి అందినకాడికి దండుకుంటున్నారు. వెండి, బంగారు వ్యాపారులతో కుమ్మక్కై వారు చేసే జీరో వ్యాపారానికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే కొంత మందికి గంజాయి మాఫియా సభ్యులతో సంబంధాలున్నట్లు తేలినట్లు సమాచారం.

Tags :

Advertisement