Advertisement

ప్రాణ, ఆస్తినష్టానికి తావులేకుండా చర్యలు...

By: chandrasekar Thu, 15 Oct 2020 09:37 AM

ప్రాణ, ఆస్తినష్టానికి తావులేకుండా చర్యలు...


హైదరాబాద్: భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌ నుంచి మున్సిపల్‌శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణతో కలిసి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు.

శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటి పరిసరాల్లోకి ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. ఆ తరువాత వాటి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు తగ్గిన తర్వాత అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలో నీటి నిల్వలు ఉండకుండా తక్షణమే పంపింగ్‌ చేయించాలని తెలిపారు.

Tags :
|

Advertisement