Advertisement

  • హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్న పాస్లర్ల పై చర్యలు: జగన్ ప్రభుత్వం

హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్న పాస్లర్ల పై చర్యలు: జగన్ ప్రభుత్వం

By: chandrasekar Sat, 07 Nov 2020 2:19 PM

హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్న పాస్లర్ల పై చర్యలు: జగన్ ప్రభుత్వం


కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఏపీ లో హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్న పాస్లర్ల పై చర్యలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులుగా మతం మారి ఎస్సీ, ఓబీసీ వర్గాల ప్రతిఫలాలను పొందుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు ఉన్నా పాస్లర్ల కింద విపత్తు ఉపశమన నిధి నుంచి రూ. 5 వేలు పొందుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఏపీలో పాస్టర్లకు రూ.5 వేలు ఇవ్వడాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్‌ ఫోరం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీనివల్ల వీరిపై చర్యలు చేపట్టనున్నారు.

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్‌లకు రూ. 5 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. కానీ 70 శాతం మంది హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు కలిగి ఉండి పాస్టర్లకు సంబంధించిన భత్యాలు పొందుతున్నారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం పేర్కొంది. ఈ తరుణంలో హిందూ సర్టిఫికెట్లు కలిగి ఉండి పాస్టర్లుగా డబ్బు తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సంచలన ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని సూచించింది. దీనివల్ల వీరు ప్రతిఫలాన్ని కోల్పోనున్నారు.

Tags :

Advertisement