Advertisement

  • ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టిన డీసీఎం ...డ్రైవర్ కు తీవ్ర గాయాలు

ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టిన డీసీఎం ...డ్రైవర్ కు తీవ్ర గాయాలు

By: Sankar Mon, 28 Dec 2020 11:57 AM

ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టిన డీసీఎం ...డ్రైవర్ కు తీవ్ర గాయాలు


దట్టమైన పొగమంచు కారణంగా వాహణాలు ప్రమాదాల బారినపడుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. ఇలాంటి ఘటనే బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.

హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ టైర్‌ పంచర్‌ అయ్యింది. దీంతో రోడ్డు పక్కన లారీని ఆపిన డ్రైవర్‌.. దాని టైర్‌ను మార్చుతున్నాడు. ఈ క్రమంలో కర్నూలు వైపు వెళ్తున్న ఓ డీసీఎం వెనుక నుంచి ఆ లారీని ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ప్రమాదంతో బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ వాహనాలను పక్కకు తొలగించారు. వాహనాల రాకపోకలను క్లియర్‌ చేశారు. జాతీయరహదారిపై మంచు బాగా కమ్ముకోవడంతో ముందున్న వాహనం కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

Tags :
|

Advertisement