Advertisement

  • పండగ పూట జంట నగరాలలో యాక్సిడెంట్ మరియు పేలుడు

పండగ పూట జంట నగరాలలో యాక్సిడెంట్ మరియు పేలుడు

By: Sankar Sun, 25 Oct 2020 4:08 PM

పండగ పూట జంట నగరాలలో యాక్సిడెంట్ మరియు పేలుడు


హైదరాబాద్‌లో పండగ పూట రోడ్డు ప్రమాదం జరిగింది. అబ్దుల్లాపుర్ మెట్ మండల కేంద్రంలో డీజిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది.

అయితే ఇతర వాహనాలను తప్పించుకుంటూ వచ్చి ఒక్కసారిగా రోడ్డుపై పల్టీలు కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఏం జరుగుతోందో అర్థం కాక ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. మరోవైపు, బోల్తాపడిన ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకవడంతో అగ్ని ప్రమాదం భయంతో స్థానికులు ఆందోళన చెందారు.

పండగ పూట కావడం.. రోడ్డుపై షాపుల వద్ద జనసంచారం ఎక్కువగా ఉండడంతో డ్రైవర్ చక చాక్యం వ్యవహరించాడు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అబ్దుల్లాపుర్ మెట్ పోలీసులు పరిస్థితిన సమీక్షించారు. స్వల్ప గాయాలు అయిన డ్రైవర్ ను మరియు క్లినర్ ను చికిత్స నియమితం స్థానిక హాస్పిటల్ కి తరలించారు.పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక మరోవైపు సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉన్న చెత్త కుప్పలో పెయింట్ డబ్బాను చెత్త ఎత్తుకునే వ్యక్తి ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అతడు గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి టిన్నర్‌ డబ్బాగా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు

Tags :
|

Advertisement