Advertisement

  • కరోనా కేసుల పెరుగుదలతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ..వారంలో రెండు రోజులు లాక్ డౌన్

కరోనా కేసుల పెరుగుదలతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ..వారంలో రెండు రోజులు లాక్ డౌన్

By: Sankar Mon, 20 July 2020 9:26 PM

కరోనా కేసుల పెరుగుదలతో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ..వారంలో రెండు రోజులు లాక్ డౌన్



కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వారానికి రెండు రోజులు రాష్ర్టవ్యాప్త సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. గురు, శనివారం పూర్తి లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ్ సోమవారం తెలపారు.

“ఈ వారం నుంచి ప్రతి వారం రెండు రోజుల పూర్తి లాక్‌డౌన్‌ ఉంటుంది. ప్రస్తుత వారంలో గురు, శనివారం విస్తృత ఆధారిత కంటైనేషన్ జోన్ విధానాన్ని అమలు చేయడంతో పాటు రాష్ట్రమంతటా పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైందని ఆయన పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించిన తరువాత, కొన్ని సమూహాల్లో వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉన్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. ఈ రెండు రోజుల లాక్‌డౌన్‌ జూలై 31 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

దీనికి సంబంధించి కోల్‌కతా డీఎంలు, డీజీపీ, సీపీ తదితరులకు సలహాలు, సూచనలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 42,487 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం కూడా రాష్ట్రంలో మొత్తం 2,278 కొత్త కేసులు వచ్చాయి. ఇది ఇప్పటివరకు నమోదైన కేసుల్లో అత్యధికం. వెస్ట్‌ బెంగాల్‌లో ఇప్పటిరవకు మొత్తం 1,112 మంది కరోనాతో మరణించారు.

Tags :
|

Advertisement