Advertisement

  • దేశంలో దాదాపు 15% మంది యాంటీబాడీస్ కలిగి ఉన్నారు

దేశంలో దాదాపు 15% మంది యాంటీబాడీస్ కలిగి ఉన్నారు

By: chandrasekar Thu, 23 July 2020 11:36 AM

దేశంలో దాదాపు 15% మంది యాంటీబాడీస్ కలిగి ఉన్నారు


దేశంలో దాదాపు 18 కోట్ల మంది కరోనావైరస్‌కు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రతిరోధకాలు (యాంటీబాడీస్‌) ను కలిగి ఉన్నారని థైరోకేర్‌ సంస్థ తెలియజేసింది.

ఈ సంస్థ సుమారు 600 నియోజకవర్గాల్లో 60,000 మందిని సుమారు 20 రోజుల పాటు యాంటీబాడీస్‌ పరీక్షలను చేసిన తరువాత ఈ ప్రకటన విడుదల చేసింది.

వారి అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 15% మందిఇప్పటికే కరోనావైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను కలిగి ఉండవచ్చునని వారు తెలిపారు. ఈ విషయాన్ని థైరోకేర్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ వెలుమని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.

థైరోకేర్‌ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ పరీక్షలను చేయడానికి ప్రత్యేకంగా ఎవరినీ ఎంచుకోలేదని, 80శాతం మంది వారంతట వారే కార్పొరేట్ల నుంచి వచ్చి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. ఒక్క థైరోకేర్‌ మాత్రమే కాకుండా ఢిల్లీలోని మరో సంస్థ కూడా ఇలాంటి సర్వేనే చేసింది.

ఈ సర్వేలో ప్రపంచంలో 23శాతం మంది యాంటీబాడీస్‌ను కలిగి ఉన్నట్లు తెలియజేసింది. భారతదేశంలో కరోనా కేసులు 11లక్షలు దాటగా సుమారు 28000 మంది ఇప్పటివరకు మృతి చెందారు.

Tags :
|
|

Advertisement