Advertisement

  • పదవ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి ..మంచు విష్ణు

పదవ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి ..మంచు విష్ణు

By: Sankar Mon, 29 June 2020 6:14 PM

పదవ తరగతి పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి ..మంచు విష్ణు



కరోనా కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో అన్ని కార్యకలాపాలు ఆగిపోయాయి ..అయితే లాక్ డౌన్ లో కొంచెం సడలింపులు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి తగ్గకపోవడం వలన కొన్ని రాష్ట్రాలలో పదవ తరగతి పరీక్షలను రద్దు చేసారు ..అందులో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉన్నాయి ..అయితే పదవ తరగతి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలనీ అన్నారు తెలుగు సినిమా హీరో మంచు విష్ణు ..

ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి? అంటూ మంచు విష్ణు ట్విటర్‌లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభి​ప్రాయంతో ఏకీభవిస్తున్నారు

గతంలో 7వ తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు ఉండేవని ఆ తర్వాత తీసేశారని ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. ‘విద్యాభ్యాసానికి మ‌న ప‌రీక్షల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ ఒక‌ శాపం లాంటిది’ అని జాకీర్ హుస్సేన్ క‌మిటీ 1939 లోనే వ్యాఖ్యానించిన విషయాన్ని మరో నెటిజన్‌ గుర్తుచేశాడు.

Tags :
|
|

Advertisement