Advertisement

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ..అభిజీత్

By: Sankar Mon, 21 Dec 2020 10:18 AM

బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ ..అభిజీత్


బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే నిన్న సాయంత్రం అట్టహాసంగా జరిగింది ..అందరు ఊహించినట్లే అభిజీత్ ఏ విజేతగా నిలిచాడు..ఫైనల్లో ఉన్న చివరి అయిదుగురు కంటెస్టెంట్స్ లలో హారిక తొలుత ఎలిమినేట్ అవ్వగా , ఆ తర్వాత అరియనా ఎలిమినేట్ అయింది...ఇక రేస్ లో చివరగా టాప్ త్రి లో అభిజీత్ , అఖిల్ , సోహెల్ మిగిలారు..

అయితే ఎవరు ఊహించని విధంగా సోహెల్ 25 లక్షలు తీసుకొని స్వతంత్రంగా ఎలిమినేట్ అయ్యాడు...ఇలా బిగ్ బాస్ చరిత్రలో మనీ తీసుకొని బయటకు వచ్చిన ఒకే ఒక్క కంటెస్టెంట్ సోహెల్..బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా ‘అభిజిత్’ ను ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో అభిజిత్ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగి పోయారు. రన్నరప్ గా 2వ స్థానం అఖిల్ నిలిచాడు.

అంతకు ముందు దర్శకుడు అనిల్ రావిపూడి, మెహరీన్, రాయ్ లక్ష్మి, ప్రణీత లాంటి వారంతా బిగ్ బాస్ ఫినాలే లో సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి అలరించారు. థమన్ బృందం కూడా తమ పాటలతో అలరించింది. ఈ సీజన్‌లో ఎలిమినేషన్స్ చాలా వరకూ ఎవరి అంచనాలకు అందకుండా జరగడం విశేషం.

Tags :
|
|

Advertisement