Advertisement

  • విరాట్ కొట్టిన సూపర్ షాట్ పై స్పందించిన ఎబిడి

విరాట్ కొట్టిన సూపర్ షాట్ పై స్పందించిన ఎబిడి

By: Sankar Sun, 06 Dec 2020 10:17 PM

విరాట్ కొట్టిన సూపర్ షాట్ పై స్పందించిన ఎబిడి


టీమిండియా ఆస్ట్రేలియా మధ్య ఈ రోజు జరిగిన రెండో టి ట్వంటీ మ్యాచ్ లో టీం ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే...అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కొట్టిన అద్భుత షాట్ కు అందరు ఫిదా అయ్యారు..మోకాలిపై కూర్చొని ఫైన్ లెగ్ దిశగా కోహ్లి కళ్లు చెదిరే సిక్స్ బాదాడు.

విరాట్ ఆడిన ఈ షాట్ కామెంటేటర్లను ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ఈ షాట్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావ్ అని డివిలియర్స్‌కు మెసేజ్ పెడతానని తెలిపాడు. విరాట్ షాట్‌ను వీక్షించిన ఏబీ డివిలియర్స్ సైతం.. ట్విట్టర్ ద్వారా స్పందించాడు. సూపర్ ఎమోజీలతో కోహ్లి సిక్స్ కొట్టిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

కాగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆఖర్లో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన హార్దిక్ పాండ్య.. టీమిండియాకు విజయాన్ని అందించాడు...

Tags :

Advertisement