Advertisement

  • నా టెస్ట్ కెరీర్ ముగిసింది ..సంచలన వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్

నా టెస్ట్ కెరీర్ ముగిసింది ..సంచలన వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్

By: Sankar Fri, 28 Aug 2020 12:47 PM

నా టెస్ట్ కెరీర్ ముగిసింది ..సంచలన వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్


ఆస్ట్రేలియా తరఫున టెస్టు మ్యాచ్‌ల్లో ఆడేది అనుమానమేనని వన్డే కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ అన్నాడు. దాదాపుగా తన టెస్టు కెరీర్‌ ముగిసినట్లేనని వ్యాఖ్యానించాడు. 3 వన్డేలు, 3టి20 మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న ఫించ్‌... కెరీర్‌ ముగిసేలోగా చివరగా ఒక టెస్టు మ్యాచ్‌ ఆడాలని ఉందంటూ తన ఆసక్తిని బయట పెట్టాడు. భారత్‌లో 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌ తనకు చివరి సిరీస్‌ అవుతుందని చెప్పాడు.

‘నేనింకా టెస్టులు ఆడే అవకాశం ఉందని అనుకోవట్లేదు. ఎరుపు బంతితో ఆడతానని చెప్తే అది అబద్ధమే అవుతుంది. టెస్టు జట్టులో చోటు కోసం ఇప్పట్లో నేను ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడలేను. మరోవైపు యువకులు దూసుకొస్తున్నారు. టాపార్డర్‌లో ఇమిడిపోయే యువకులే అధికంగా వెలుగులోకి వస్తున్నారు’ అని ఫించ్‌ చెప్పాడు.

అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రస్తుత తరంలో గొప్ప ఆటగాళ్లలో ఒకడైన ఫించ్ టెస్ట్ క్రికెట్లో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు..పరిమిత ఓవర్ల క్రికెట్ లో ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అయిన ఈ స్టార్ ఆటగాడు టెస్ట్ క్రికెట్ లో మాత్రం కేవలం అయిదు టెస్టులు మాత్రమే ఆడాడు..

Tags :
|

Advertisement