Advertisement

  • భారత్ ఆరోగ్య సేతు యాప్ తో ప్రజలను అప్రమత్తం చేసింది ...ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

భారత్ ఆరోగ్య సేతు యాప్ తో ప్రజలను అప్రమత్తం చేసింది ...ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు

By: Sankar Tue, 13 Oct 2020 7:39 PM

భారత్ ఆరోగ్య సేతు యాప్ తో ప్రజలను అప్రమత్తం చేసింది ...ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు


భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి మొద‌లు కాగానే.. ఆరోగ్య సేతు యాప్‌తో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది స‌ర్కార్... ఈ క‌రోనా ట్రాకింగ్ యాప్‌ను తీసుకురావ‌డంతో పాటు.. విస్తృతంగా ప్ర‌చారం కూడా క‌ల్పించింది. ఈ యాప్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది.

ఇది క్లస్టర్లను గుర్తించడమే కాకుండా, పరీక్షలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి ఎంత‌గానో దోహ‌దం చేసింది ప్ర‌శంసించింది. కోవిడ్-19 వ్యాప్తిని విచ్ఛిన్నం చేసేందుకు సెల్ఫ్ ఐసోలేషన్, కాంట్రాక్ట్ ట్రేసింగ్ వంటి ప్రయోగాత్మకంగా పరీక్షించిన ప్రజారోగ్య సాధనాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌న్నారు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్.. మొబైల్ అప్లికేషన్ వంటివి వీటిని మరింత ప్రభావవంతంగా పనిచేయించేలా చేయగలవని తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆరోగ్యసేతు యాప్‌ను ఇప్ప‌టికే 150 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్టు ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

ఇక‌, క‌రోనా నిర్ధార‌ణ పరీక్షలను పెంచడంలో.. నగర ప్రజారోగ్య విభాగాలకు ఆరోగ్యసేతు ఎంతగానో దోహ‌దం చేసింద‌న్నారు ట్రెడ్రోస్.. భార‌త్ ఆరోగ్య సేతు యాప్ తీసుకువ‌స్తే.. జర్మనీ.. కరోనా వార్న్ యాప్, యూకే.. ఎన్‌హెచ్ఎస్’ఎస్ కోవిడ్-19 యాప్ వంటివి తీసుకొచ్చాయ‌ని.. కరోనా సోకిన వ్యక్తులను గుర్తించి ఇవి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు తోడ్పడతాయని తెలిపారు.

Tags :
|
|

Advertisement