Advertisement

  • ఈ ఐపీయల్ లో ఆ జట్టు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది

ఈ ఐపీయల్ లో ఆ జట్టు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది

By: Sankar Sun, 06 Sept 2020 4:24 PM

ఈ ఐపీయల్ లో ఆ జట్టు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది


యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. అందుకోసం ఇప్పటికే అక్కడికి వెళ్లిన ఐపీఎల్ జట్లు తమ క్వారంటైన్ ముగించుకొని ప్రాక్టీస్ కూడా చేస్తున్నాయి. అయితే మన ఐపీఎల్ ఉన్న కొన్ని నియమాలలో ఒక నియమం మాత్రం చాలా ముఖ్యం. అదేంటంటే మ్యాచ్ ఆడే తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండలి. అంతకంటే తక్కువ ఉంటె సమస్య లేదు కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు.

కానీ ఏ జట్టు అయిన సరే అంతకంటే విదేశీ ఆటగాళ్లను తక్కువగా ఉపయోగించదు. కానీ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు అదే పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ జట్టులో భారత ఆటగాళ్లు ఎక్కువగా ఉండేసరికి తుది జట్టులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లకు మాత్రమే ఛాన్స్ ఉండేలా కనిపిస్తుంది. ఈ విషయాన్ని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌చోప్రా వెల్లడించారు. అలాగే అభిమానులతో చిట్ చాట్ చేసిన ఆకాశ్‌చోప్రా ను ఓ అభిమాని ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న నలుగురు స్పిన్నర్లలో (అమిత్‌ మిశ్రా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, సందీప్‌ లామిచ్చనే) రెగ్యులర్‌గా ఆడే ఇద్దరు ఎవరుంటారని ప్రశ్నించాడు..

ఇక ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఇందులో అశ్విన్‌, అక్షర్‌ బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ కూడా చేస్తారు. మిశ్రా, సందీప్‌ రెగ్యులర్ బౌలర్లు. కాబట్టి ఆ జట్టు ముగ్గురు స్పినర్లతో బరిలోకి దిగ్గుతుంది . నలుగురితో వచ్చిన ఆశ్చర్యం లేదు. కానీ ముగ్గురు మాత్రమే అయితే అశ్విన్‌ మాత్రం తప్పకుండ ఉంటాడు. మిగిలిన వారిని జట్టు తమ ప్లాన్ కు తగినట్లు ఎన్నుకుంటుంది అని ఆకాశ్‌చోప్రా తెలిపాడు.

Tags :

Advertisement