Advertisement

  • యూఏఈ లో ఐపీయల్ జరిగితే ఆ జట్టు గెలిచినట్లే ..ఆకాష్ చోప్రా

యూఏఈ లో ఐపీయల్ జరిగితే ఆ జట్టు గెలిచినట్లే ..ఆకాష్ చోప్రా

By: Sankar Fri, 24 July 2020 10:16 AM

యూఏఈ లో ఐపీయల్ జరిగితే ఆ జట్టు గెలిచినట్లే ..ఆకాష్ చోప్రా



ఐపీయల్ పదమూడవ సీజన్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే ..అయితే ఆస్ట్రేలియాలో జరిగే టి ట్వంటీ ప్రపంచకప్ వాయిదా పడటంతో మల్లి ఐపీయల్ మీద ఆశలు చిగురించాయి ..దీనికి తగ్గట్లే బీసీసీఐ కూడా యూఏఈ లో ఐపీయల్ నిర్వహిస్తాం అని చెబుతుంది దీనితో ఐపీయల్ జరగడం కంఫర్మ్ అని తెలిసిపోయింది ..అయితే ఒకవేళ యూఏఈ లో ఐపీయల్ జరిగితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కు విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నాడు టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ..

ఈ పన్నెండేళ్లలో ఏం జరిగిందో అందరూ దాన్ని మర్చిపోవాలి. ఒకవేళ యూఏఈలో ఐపీఎల్ జరిగితే ఏ టీమ్‌కు కూడా మరింత లాభం చేకూరే అవకాశం లేదు. తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు ఆడితే హోం సపోర్ట్‌ ఉండదు. పిచ్‌లు కూడా ఒకే తీరులో ఉండవు. ప్రతి టీమ్ ఒకేలా ప్రారంభించాలి. ముంబై, చెన్నై లాంటి టాప్ క్లాస్‌ టీమ్స్‌ మొదట్లో వెనుకపడినా అవి త్వరగా పుంజుకుంటాయి. యూఏఈలో వేడి ఎక్కువ. మైదానాలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇది బ్యాట్స్‌మెన్‌కు బాగా కలిసొచ్చే అంశం. దీంతో బ్యాటింగ్ బలంగా ఉండి.. బౌలింగ్ వీక్‌గా ఉన్న ఆర్సీబీ లాంటి జట్లకు వారి బౌలింగ్ లోపాలు ఎక్కువగా బయటపడవు. అలాగే మంచి స్పిన్నర్లు ఉన్న చెన్నై, పంజాబ్ జట్లకు అక్కడి పెద్ద గ్రౌండ్లు కలిసివస్తాయి’ అని ఆకాశ్‌ చోప్రా తెలిపాడు..

ఐపీఎల్ యూఏఈలో జరగడం వల్ల పెద్ద ఇబ్బందేమి ఉండదు. కాకపోతే అక్కడి వాతావరణం పరిస్థితులను తట్టుకోవడమే కొంచం కష్టం. యూఏఈ వాతావారణం పరిస్థితులు ఆటగాళ్ళకు సవాలుగా మారొచ్చు. అక్కడి వేడి తట్టుకోవడం కష్టమే. కానీ సెప్టెంబర్‌, అక్టోబర్‌లలో వాతావరణం కొంత చల్లగానే ఉంటుంది. సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 7 వరకు టోర్నీ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితులలో ఈవెంట్ తొందరగా ముగించాలంటే రోజుకు రెండు మ్యాచ్‌లు నిర్వహించక తప్పదు’ అని ఆకాశ్‌ చోప్రా అన్నాడు.

Tags :
|
|

Advertisement