Advertisement

  • చెత్తలో పడేసే కండోమ్‌లను కడిగేసి.. అమ్మేయడమే వీరి బిజినెస్

చెత్తలో పడేసే కండోమ్‌లను కడిగేసి.. అమ్మేయడమే వీరి బిజినెస్

By: Anji Fri, 25 Sept 2020 07:27 AM

చెత్తలో పడేసే కండోమ్‌లను  కడిగేసి.. అమ్మేయడమే వీరి బిజినెస్

వాడిన కండోమ్‌ను అదే వ్యక్తి రెండోసారి ఉపయోగిస్తే కొత్త రోగాలు వస్తాయ్. అలాంటిది.. వేరెవరో వాడేసిన కండోమ్‌ను ఇతరులు వాడితే? ఒక్కసారి ఊహించుకోండి ఎంత దారుణంగా ఉంటుందో. బయట చెత్తలో పడేసే కండోమ్‌లను సేకరిస్తూ కొందరు చిన్న తరహా పరిశ్రమ పెట్టేశారు. వాడిన కండోమ్‌లను కడిగేసి.. కొత్తవిగా అమ్మేయడమే వీరి బిజినెస్. ఈ దందా జరుగుతోంది మన దేశంలో కాదండోయ్, వియత్నాంలో. అక్కడ ఇది బయటపడింది కాబట్టి.. ప్రపంచానికి తెలిసింది. మన దేశంలో కూడా ఇలాంటివి చాలానే ఉంటాయి.

కాబట్టి, అప్రమత్తంగా ఉండటం బెటర్. అందుకే.. ఈ సమాచారం. వియత్నాంలోని బిన్ దువాంగ్‌లోని పరిశ్రమలో వాడేసిన కండోమ్‌లను శుభ్రం చేసి ప్యాక్ చేస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడ దాడులు చేశారు. ఈ సందర్భంగా 3.2 లక్షల వాడేసిన కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఆ పరిశ్రమలో శుభ్రంగా కడిగి.. కొత్తగా కనిపించేందుకు ఆయిల్ రాసి కలరింగ్ ఇస్తున్నారు. అనంతరం చక్కని ప్యాకింగ్‌లో పెట్టి.. ఒరిజనల్ ప్యాకెట్లలో కలిపేస్తున్నారు.


ఈ దందా నడిపిస్తున్నది ఓ మహిళ అని తెలిసి పోలీసులు నోరెళ్లబెట్టారు. ఈ విషయం బయటపడగానే.. వియత్నాంలో పర్యటించిన, పర్యటిస్తున్న విదేశీ టూరిస్టులకు దిమ్మతిరిగింది. ఎందుకంటే.. ఒకరు వాడేసిన కండోమ్‌లను ఇతరులు వాడితే.. సుఖ రోగాలతోపాటు ఎయిడ్స్, వైరస్‌లు వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి.. కండోమ్‌లు కొనుగోలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Tags :
|
|
|

Advertisement