Advertisement

  • డయాబెటిక్ రోగులలో గాయాలు త్వరగా నయం చేసే చికిత్స

డయాబెటిక్ రోగులలో గాయాలు త్వరగా నయం చేసే చికిత్స

By: chandrasekar Fri, 20 Nov 2020 11:21 AM

డయాబెటిక్ రోగులలో గాయాలు త్వరగా నయం చేసే చికిత్స


డయాబెటిక్ రోగులలో గాయాలు త్వరగా నయం చేసే చికిత్స కనుగొన్నారు. స్పిరులినా నుంచి స్మార్ట్ ఇంజెక్ట్ చేయగల హైడ్రోజెల్ వల్ల డయాబెటిక్ రోగులలో గాయాలు త్వరగా నయమవుతాయని ఐఎన్ఎస్టీ శాస్త్రవేత్తలు తెలిపారు. గాయం నయం చేసే ఇతర చికిత్సలతో పోలిస్తే అన్ని వయసుల వారికి హైడ్రోజెల్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. స్పిరులినా నుంచి తీసుకున్నఇంజెక్షన్ హైడ్రోజెల్ డయాబెటిస్ రోగుల్లో అంతర్గత గాయాలను వేగంగా తగ్గిస్తుంది. అంతేకాదు డయాబెటిక్ ఉన్నవారి గాయాన్ని పదేపదే డ్రెస్సింగ్ చేయడం వల్ల అది మానడం ఆలస్యమవుతుంది. మొహాలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఎన్ఎస్టీ) లోని శాస్త్రవేత్తలు, మొహాలి, ప్రభుత్వరంగానికి చెందిన స్వయంప్రతిపత్తి గల సంస్థ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) ఇటీవలే కప్పాక్యారేజీనన్ అనే నీటిలో కరిగే పాలిసాకరైడ్ హైడ్రోజెల్ ను అభివృద్ధి చేసింది. ఎర్ర సముద్రపు నీటి పాచిలో ఇది ఉంటుంది. సిరు-ఫైకోసైనిన్ అనే పిగ్మెంటెడ్ ప్రోటీట్ను స్పిరులినాలో కనిపెట్టారు. గాయాన్ని వేగంగా నయం చేయడానికి మరియు వాస్తవిక పురోగతిని పర్యవేక్షించడానికి కె- క్యారేజీనన్ జెల్లింగ్ ను సి-ఫైకోసైనిన్‌తో పాటు పరిశోధకులు ఇంజెక్షన్ గా ఇచ్చారు. దీనివల్ల గాయాలు వేగంగా తగ్గాయి.

గాయాల కోసం ఇప్పుడు అభివృద్ధి చేసిన మాత్రిక అత్యంత జీవ అనుకూలత కలిగి ఉంది. ‘ఆక్టా బయోమెటీరియా’ పత్రికలో ప్రచురించిన వివరాల ప్రకారం బాధాకరమైన గాయం ఉన్నప్పుడు ఈ రెండింటి కలయిక వల్ల రక్త ప్రవాహం బాగా తగ్గింది. డాక్టర్ సూరజిత్ కర్మకర్ , అతని బృందం అభివృద్ధి చేసిన హైడ్రోజెల్ మాతృక ఫ్లోరోసెంట్, వివో నియర్-ఇన్ఫ్రారెడ్ (ఎన్ఐఆర్) ఇమేజింగ్‌లో అనుమతించనున్నారు. అందువల్ల, హైడ్రోజెల్ నిండిన గాయం మానడాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. ఇందుకోసం త్రీడీ చిత్రాలను ఉపయోగిస్తారు. గాయం లోతును మార్చడం ద్వారా అది వేగంగా తగ్గడాన్ని గమనించవచ్చు. ఇటువంటి ఇమేజింగ్ అంతర్గత గాయాలు, డయాబెటిక్ రోగులలో గాయం మరమ్మతులను వాస్తవికంగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. కె- క్యారేజీనన్-సి-ఫైకోసైనిన్ (కె -సీఆర్జీ-సి-పీసీ) గాయంతో కలిగే మంటను తగ్గిస్తుంది. రక్తం వేగంగా గడ్డకట్టేలా చేస్తుంది. ఐఎన్ఎస్టీ పరిశోధన ప్రకారం హైడ్రోజెల్ అన్ని వయసుల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఇంజెక్షన్ రోగుల పెరిటోనియం తెరవకుండా దాని గాయాలను చేరుకుంటుంది. కర్మాకర్ బృందం ఇప్పుడు క్యారేజీనన్-సి-ఫైకోసైనిన్హై డ్రోజెల్ చర్యపై ప్రయోగాలు చేస్తున్నది. గాయం నయం, పునరుత్పత్తి లక్షణాల ప్రక్రియను అన్వేషించడంపై ఇది దృష్టి సారిస్తుంది. దీనివల్ల గాయాలు త్వరగా నయమవుతుంది.

Tags :
|

Advertisement