Advertisement

ఎలుక చేసిన నష్టం విలువ కోటి రూపాయలు ..

By: Sankar Fri, 21 Aug 2020 05:03 AM

ఎలుక చేసిన నష్టం విలువ కోటి రూపాయలు ..


ఎప్పుడో ఆరు నెలల క్రితం జరిగిఆన్ ఫైర్ ఆక్సిడెంట్ లో ఒక కంపెనీ దాదాపు కోటి రూపాయలు దాకా నష్టపోయింది ..అందరు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని నష్టం జరిగింది అని భావించారు..కానీ విచారణలో తేలిన విషయం తెలిసి అందరూ అవాక్కయ్యారు..

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో మారుతీ నెక్సా సర్వీస్ సెంటర్‌లో మంటలు అంటుకొని కొన్ని కార్లు కాలిపోయిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తారీఖున అర్ధరాత్రి జరిగింది. సర్వీస్ సెంటర్‌లోని మొదటి అంతస్తులో మంటలు అంటుకొని నిమిషాల వ్యధిలోనే అవి గ్రౌండ్ ఫ్లోర్‌కు వ్యాపించాయి.

అక్కడే సర్వీస్‌ కోసం వినియోగదారులు ఇచ్చిన కార్లను పార్క్ చేసి ఉంచారు. ఆ మంటలకు కార్లు కూడా కాలిపోయాయి. హుటాహుటిన ఫైరింజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు రూ.కోటి వరకూ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు..

ఈ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఆ మంటలు షార్ట్ సర్క్యూట్ వల్ల వ్యాపించాయని కేసును మూసేశారు. ఈ ఘటన జరిగిన ఆర్నెల్ల తర్వాత గురువారం అసలు విషయం బయటికి వచ్చింది. ప్రమాదానికి గల కారణాలపై ఇటీవల షోరూంలోని సీసీటీవీ ఫుటేజీని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్ ఏజెన్సీ విశ్లేషించింది. అందులో మంటలు చెలరేగినందుకు గల అసలు కారణం బయటపడింది.

అగ్ని ప్రమాదం జరిగిన రోజు సర్వీస్ సెంటర్ తెరిచాక ఉదయం పూజ నిర్వహించారు. సిబ్బంది పూజ చేసి దీపం వెలిగించారు. హారతిని అందరి దగ్గరికీ తీసుకెళ్లారు. సాయంత్రం ఎప్పట్లాగే సిబ్బంది మొత్తం తమ డ్యూటీలు ముగించుకొని సర్వీస్ సెంటర్‌కు తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, ఆఫీస్‌లో ఎలాంటి పెద్ద గాలి లేకపోవడంతో ఉదయం వెలిగించిన దీపం రాత్రి వరకూ అలా వెలుగుతూనే ఉంది..

అదేరోజు రాత్రి 11.51 గంటల సమయంలో ఓ ఎలుక వెలుగుతున్న దీపపు వత్తిని నోటితో కరుచుకొని సిబ్బంది పని చేసుకొనే డెస్కు దగ్గరికి తీసుకొచ్చింది. అది దాని నోటి నుంచి జారి 11.55 నిమిషాలకు కుర్చీపై పడింది. ఇక 12.01కి ఆ కుర్చీకి డెస్కుకు మధ్య వెలుగు కనిపించింది. 12.06 నిమిషాలకు ఆ కుర్చీ మొత్తం పెద్ద మంటతో తగలబడడం మొదలైంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే మంటలు గ్రౌండ్ ఫ్లోర్‌కు వ్యాపించి తీరని నష్టం జరిగింది.

Tags :
|
|

Advertisement