Advertisement

ఏ.ఆర్‌ రెహ‌మాన్‌కు అరుదైన గౌర‌వం...

By: chandrasekar Mon, 30 Nov 2020 7:32 PM

ఏ.ఆర్‌ రెహ‌మాన్‌కు అరుదైన గౌర‌వం...


సంగీత ప్ర‌పంచంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకున్న సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్‌కు తాజాగా అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఏర్‌ఆర్‌ రెహమాన్‌ను బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్‌‌ట్స(బాఫ్టా) సంస్థ ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇనిషియేటివ్‌ అంబాసిడర్‌గా రెహ‌మాన్‌ని నియమించినట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. నెట్‌ఫ్లిక్స్‌ సహకారంతో భారత్‌లో ఉన్న గొప్ప కళాకారులను గుర్తించడానికి ఏర్‌ఆర్‌ రెహమాన్‌ను అంబాసిడ‌ర్‌గా నియమించింది.

ఇలాంటి అరుదైన గౌర‌వం ద‌క్క‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసిన రెహ‌మాన్.. బాఫ్టాతో పని చేస్తూ.. సినిమాలు, టీవీ, ఆట ఇలా ప‌లు రంగాల‌లో అద్భుత‌మైన ప్ర‌తిభ క‌న‌బరిచే వారిని గుర్తించ‌డం కోసం ఉత్సాహంగా ఉన్నాను అని తెలిపారు. భారత్‌లో అద్భుతమైన టాలెంట్‌ కలిగి ఉన్న ఆర్టిస్టులను ప్రపంచవేదికపై నిలబెట్టడానికి ఆత్రుతగా ఎదురు చూసున్నట్టు తెలియజెశారు.

Tags :
|
|

Advertisement