Advertisement

  • ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా కోసం రంగంలోకి దిగనున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ !

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా కోసం రంగంలోకి దిగనున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ !

By: Sankar Mon, 14 Sept 2020 09:24 AM

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా కోసం రంగంలోకి దిగనున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ !


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు...ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష సినిమాలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే..ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు..దీంతో ఈ సినిమా ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి..ఇక ఈ సినిమాలో రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు..

అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరొక ఆసక్తికర అంశం ఇప్పుడు చర్చంశనీయం అయింది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఏ ఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో తెరకక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఇటువంటి చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు అయితే సినిమా ఇంకో రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చిత్ర యూనిట్ భావిస్తుంది. అయితే ఇంకా సంప్రదింపు జరిపే ఆలోచనలో ఉండగా, ఇంకా ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రభాస్ అభిమానుల్లోనే గాక దేశ వ్యాప్తగా సినీ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి..

Tags :

Advertisement