Advertisement

  • పోలీస్‌ దుస్తులతోపాటు లాఠీలు, ఇతర వస్తువులపై ఉండే వైరస్‌ను నిర్మూలించే ఓ సాధనం

పోలీస్‌ దుస్తులతోపాటు లాఠీలు, ఇతర వస్తువులపై ఉండే వైరస్‌ను నిర్మూలించే ఓ సాధనం

By: chandrasekar Fri, 12 June 2020 6:26 PM

పోలీస్‌ దుస్తులతోపాటు లాఠీలు, ఇతర వస్తువులపై ఉండే వైరస్‌ను నిర్మూలించే ఓ సాధనం


రోజురోజుకి విస్తరిస్తున్న కరోనా వైరస్‌ని కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా అంటేనే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దీని ధాటికి ఇల్లు దాటికి బయటికి రావడం లేదు. ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరూ ఆ మాయదారి వైరస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కారణంగా ఆ వైరస్ నుండి ప్రాణాలు పోకుండా ముందు నుంచి జాగ్రత్తపడడం ప్రతి ఒక్కరికీ అవసరమే. కరొనా వైరస్ వ్యాపించడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ముఖ్యంగా కొన్ని అంశాలపై కచ్చితమైన అవగాహన ఉండాలని చెబుతున్నారు.

సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది. శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
పోలీస్‌ యూనిఫాం ఇక కరోనా లేకుండా చేయనున్నది ఓ సాధనం. పోలీస్‌ దుస్తులతోపాటు వారు ఉపయోగించే లాఠీలు, ఇతర వస్తువులపై ఉండే వైరస్‌ను నిర్మూలించే ఓ పరికరాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తయారు చేసింది.

ఓ చాంబర్‌ మాదిరిగా ఉండే ఇందులో ఉంచిన వస్తువులను పూర్తిగా శానిటైజ్ చేస్తుంది. ఢిల్లీ పోలీస్‌ శాఖ విన్నపం మేరకు డీఆర్డీవో దీన్ని రూపొందించింది. కరోనాపై పోరాటంలో ముందున్నవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఇటీవల పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.

ఈ నేపథ్యంలో వారి యూనిఫాంతోపాటు ఉపయోగించే వస్తువులను ఈ చాంబర్ ద్వారా వైరస్‌ రహితంగా చేయవచ్చని డీఆర్‌డీవో పేర్కొంది. రక్షణ దళాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది.

Tags :
|

Advertisement