Advertisement

  • సింగిల్ మ‌ద‌ర్ గానే ఉంటానంటున్న ప్ర‌ముఖ గాయ‌ని

సింగిల్ మ‌ద‌ర్ గానే ఉంటానంటున్న ప్ర‌ముఖ గాయ‌ని

By: chandrasekar Fri, 07 Aug 2020 11:49 AM

సింగిల్ మ‌ద‌ర్ గానే ఉంటానంటున్న ప్ర‌ముఖ గాయ‌ని


ప్ర‌ముఖ గాయ‌ని సునీత‌ త‌న గాత్రంతో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి ఎలాంటి పుకార్లు వ‌చ్చినా లెక్క‌చేయ‌కుండా విజ‌య‌వంతంగా త‌న కెరీర్ ను కొన‌సాగిస్తున్నారు.

ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్య్వ్యూలో త‌న రిలేష‌న్ షిప్ స్టేట‌స్ గురించి చెప్పారు. చాలా ఏండ్ల క్రితం త‌న భ‌ర్త‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత మ‌ళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగా జీవితాన్ని గ‌డుపుతున్న‌ట్టు చెప్పారు.

అంతేకాదు సింగిల్ మ‌ద‌ర్ గానే త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను బాగోగులు చూసుకుంటున్నాన‌న్నారు. చాలా చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసుకున్న సునీత‌ మ‌ళ్లీ పెళ్లి చేసుకోలేదు. పుకార్లతో త‌న‌కెలాంటి ఇబ్బంది లేద‌ని, త‌న కుటుంబానికి వాస్త‌వాలేంటో తెలుసున‌న్నారు. తాను ఎప్పటికీ సింగిల్ గానే ఉంటాన‌ని సునీత‌ చెబుతున్నారు.

Tags :
|
|
|

Advertisement