Advertisement

  • 11 అడుగుల కొండచిలువను కాపాడిన ఓ పోలీసు హోంగార్డు

11 అడుగుల కొండచిలువను కాపాడిన ఓ పోలీసు హోంగార్డు

By: chandrasekar Thu, 20 Aug 2020 1:01 PM

11 అడుగుల కొండచిలువను కాపాడిన ఓ పోలీసు హోంగార్డు


ఓ పోలీసు హోంగార్డు గాయ‌ప‌డ్డ కొండ‌చిలువ‌ను ర‌క్షించి దానికి చికిత్స‌ను అందించి సుర‌క్షితంగా అడవిలో విడిచిపెట్టాడు. వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణంలో చోటుచేసుకున్న ఘ‌ట‌న వివరాల్లోకి వెళితే... కొండ చిలువ త‌నంత‌ట తానుగా చేప‌లు ప‌ట్టే వ‌ల‌లో చిక్కింది. త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో పెనుగులాడి గాయ‌ప‌డింది.

దీంతో స్థానికులు వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణంలో హోంగార్డుగా ప‌నిచేసే కృష్ణ‌ సాగ‌ర్‌కు ఫోన్ చేసి స‌మాచారం అందించారు. సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న సాగ‌ర్ అత‌ని మిగ‌తా స్నేహితులు గంటపాటు శ్ర‌మించి 11 అడుగుల కొండ‌చిలువ‌ను వ‌ల నుంచి ర‌క్షించారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ కొండ‌చిలువ‌కు ప‌శు వైద్యుడిచే చికిత్స చేయించి అనంత‌రం అట‌వీ ప్రాంతంలో విడిచిపెట్టాడు.

సాగ‌ర్ స్నేక్ సొసైటీ వ్య‌వ‌స్థాప‌కుడు హోంగార్డు చీరాల కృష్ణ సాగ‌ర్‌. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌కు పాములు ఎంత అవ‌స‌ర‌మో తెలియ‌జేస్తూ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాడు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్‌, నారాయ‌ణ‌పేట్‌, వ‌న‌ప‌ర్తి నుంచి సాగ‌ర్‌కు పాముల గురించి రోజుకు క‌నీసం ఐదు ఫోన్ కాల్స్ వ‌స్తుంటాయి. ఎవ‌రు స‌మాచారం అందించిన వెంట‌నే అక్క‌డికి వెళ్లి పాముల‌ను రెస్క్యూ చేసి అట‌వీ ప్రాంతాల్లో విడిచి పెడుతుంటాడు.

Tags :

Advertisement