Advertisement

  • తక్కువ ధరతో కరోనా నిర్ధారణకు అందుబాటులోకి రానున్న కొత్త రకం పరికరం

తక్కువ ధరతో కరోనా నిర్ధారణకు అందుబాటులోకి రానున్న కొత్త రకం పరికరం

By: chandrasekar Sat, 29 Aug 2020 12:35 PM

తక్కువ ధరతో కరోనా నిర్ధారణకు అందుబాటులోకి రానున్న కొత్త రకం పరికరం


అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అత్యంత చవకైన టెస్ట్ పరికరానికి ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ నిర్ధారణకు పలు రకాల విధానాలు అమల్లో ఉన్నాయి. ఇందులో ఆర్టీ పీసీఆర్, ట్రూనాట్, ర్యాపిడ్ టెస్ట్ కిట్ లు ముఖ్యమైనవి. ఇప్పుడు కొత్త రకం పరీక్ష కిట్ కు ఆమెరికాలోని ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్ డీ ఏ ఆమోదం తెలిపింది. ప్రత్యేకమైన సాధనాలు లేకుండానే కరోనా ఇన్ ఫెక్షన్ ను నిర్ధారించే తొలి ర్యాపిడ్ టెస్ట్ ఇదేనని తెలుస్తోంది.

చిన్నసైజులో అంటే మీ క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుందీ కిట్. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే టెస్ట్ పూర్తవుతుంది. దీని ధరను 5 డాలర్లుగా నిర్ణయించారు. అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు 3 వందల రూపాయలు. అమెరికన్ మార్కెట్ లో వస్తున్న సులభమైన, చవకైన విధానమిదే. తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ పరీక్షలు చేయడానికి ఈ టెస్ట్ పరికరం ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఈ కొత్త రకం టెస్ట్ కిట్ ను ఎబ్బాట్ లేబరేటరీస్ అబివృద్ధి చేసింది.

Tags :
|
|

Advertisement