Advertisement

  • ప్రపంచదేశాలకు సవాలుగా మారనున్న కొత్త రకం కరోనా వైరస్

ప్రపంచదేశాలకు సవాలుగా మారనున్న కొత్త రకం కరోనా వైరస్

By: chandrasekar Mon, 17 Aug 2020 11:02 PM

ప్రపంచదేశాలకు సవాలుగా మారనున్న కొత్త రకం కరోనా వైరస్


మలేషియా లో వెలుగుచూస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచదేశాలకు సవాలు విసురుతోంది. ఓ వైపు వ్యాక్సిన్ కోసం మరోవైపు మందు కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో వైరస్ లో కూడా చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులే ఇప్పుడు భయం గొలుపుతున్నాయి. మలేషియాలోని ఓ రెస్టారెంట్ నుంచి ప్రారంభమైన క్లస్టర్ లో 45 కేసులు వెలుగుచూశాయి. ఇందులో మూడు కేసులు చాలా విభిన్నంగా ఉన్నాయి. ఈ మూడు కేసుల్లో కొత్త రకం కరోనా వైరస్ ను కనుగొన్నారు. ఇది ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే 10 రెట్లు అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందేలా రూపాంతరం చెందినట్టు తెలుస్తోందని అమెరికాకు చెందిన ప్రముఖ వైరాలజీ నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చరించారు. ఈ కొత్త రకం వైరస్ కు డీ 614 గా పేరు పెట్టారు.

ఈ కొత్త రకం కరోనా వైరస్ ప్రారంభమైన రెస్టారెంట్ యజమాని ఇండియా నుంచి మలేషియాకు వచ్చిన తరువాత క్వారెంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించడంతో వరుసగా 45 కేసులు వెలుగుచూశాయి. క్వారెంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన నేరానికి రెస్టారెంట్ యజమానికి మలేషియా ప్రభుత్వం 5 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. కరోనా వైరస్ పరివర్తనకు గురవుతున్నట్టు బ్లూమ్ బర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ కారణంగా వ్యాక్సిన్ల అభివృద్ధికై ఇప్పటివరకూ ఉన్న అధ్యయనాలు అసంపూర్తిగా లేదా అసమర్ధంగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అటు ఫిలిప్పీన్స్ నుంచి తిరిగొచ్చినవారిలో కూడా ఈ కొత్త వైరస్ ను కనుగొన్నట్టు తెలిసింది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ వైరస్ మ్యూటేషన్ చెందడం గమనించారు. కానీ..మలేషియాలో వెలుగుచూసిన కొత్తరకం మాత్రం అత్యంత ప్రమాదకరంగా ఉందని చెబుతున్నారు.

Tags :

Advertisement