Advertisement

కొత్త జాతి మలేరియా

By: chandrasekar Sat, 12 Dec 2020 11:08 AM

కొత్త జాతి మలేరియా


ఇప్పుడే కరోనా తో ప్రజలంతా బయపడుతుంటే ఇప్పుడు కొత్త జాతి మలేరియాను కేరళలో కనుగొన్నారు. వేరే దేశమైన సూడాన్ నుండి కేరళకు వచ్చిన ఒక సైనికుడికి చేసిన రక్తపరీక్షల్లో 'ప్లాస్మోడియం ఓవల్' అనే మలేరియా పరాన్నజీవిని గుర్తించారు. ఈ వైరస్ ప్రాణాంతకమైనదిగా చెప్పవచ్చు. ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తికి కన్నూర్‌ జిల్లా లో ని హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు.ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. మలేరియా వ్యాధి సోకడంవల్ల చాలా మంది ప్రాణాలు పోగుట్టుకున్న సంఘటనలు చాలానే వున్నాయి.

ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స చేయడం ద్వారా ఈ వ్యాధిని కట్టడి చేయవచ్చని తెలిపారు. ఈ వ్యాధి అనోఫిలస్ దోమ కాటు ద్వారా వ్యాప్తిచెందుతుంది. ఈ దోమలు ప్లాస్మోడియం పరాన్నజీవిని కలిగి వుండడం వల్ల అది మనుషుల రక్తంలో కలిసి మలేరియా గా బయటపడుతుంది. దీని బారిన పడిన వారు చలి, జ్వరంతో బాధపడుతారు. దీనినుండి బయటపడుటకు సరైన సమయంలో చికిత్స చేసి ఆంటీ వైరల్ మందులను ఇవ్వడం ద్వారా నయం చేయవచ్చు.

Tags :
|
|

Advertisement