Advertisement

కొత్తరకం మోసం...

By: chandrasekar Tue, 15 Dec 2020 4:12 PM

కొత్తరకం మోసం...


డిజిటైలజేషన్ అని ఇప్పుడు అందరూ అన్నింటికీ ఆన్ లైన్ ఉపయోగిస్తున్నారు. బ్యాంకు లోన్ల దగ్గర నుంచి కరెంట్ బిల్లులు ఫోన్ బిల్లులు అన్నిటి కోసం ఆన్ లైన్‌‌ ఉపయోగిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇలా దాదాపు అన్ని సోషల్ మీడియా అకౌంట్లను అందరూ యూస్ చేస్తూనే ఉన్నారు. కొంత మంది మోసగాళ్లు ప్రముఖుల ఫేస్ బుక్ అకౌంట్లతో మోసాలు చేస్తున్నారు.

ప్రముఖ రాజకీయ నాయకులపేర్లతో డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ పేరు, ఫోటో ఉపయోగించి ఫేస్ బుక్ ఫేక్ id క్రియేట్ చేశారు హ్యాకర్స్. విజయ్ కుమార్ గౌడ్ అనుకుని అతని స్నేహితులు నిన్నటి నుండి ఫేస్ బుక్‌లో అతనితో చాటింగ్ చేయసాగారు. దీంతో ఫ్రెండ్స్‌కు విజయ్ కుమార్ పేరుతో డబ్బులు కావాలంటూ హ్యాకర్స్ మెసేజ్ పెట్టారు. గూగుల్ పే అకౌంట్‌కు డబ్బులు వేయాలని కోరారు. కొంతమంది ఫ్రెండ్స్ విజయ్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేయడంతో విషయం తెలిసింది. వెంటనే ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి తన స్నేహితులు, ఫేస్ బుక్ ఫ్రెండ్స్ అందరికి విషయం తెలియజేసాడు. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని తెలిపారు. ఎఫ్‌బీ అకౌంట్ కూడా తనది కాదని విజయ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement