Advertisement

  • న్యూజిలాండ్‌లో 102 రోజుల తరువాత మంగళవారం ఒక కొత్త కరోనా కేసు నమోదు

న్యూజిలాండ్‌లో 102 రోజుల తరువాత మంగళవారం ఒక కొత్త కరోనా కేసు నమోదు

By: chandrasekar Tue, 11 Aug 2020 6:12 PM

న్యూజిలాండ్‌లో 102 రోజుల తరువాత మంగళవారం ఒక కొత్త కరోనా కేసు నమోదు


న్యూజిలాండ్‌లో చాలా రోజుల తరువాత్త ఒక కరోనా కేసు నమోదయింది. విషయమేమిటంటే 102 రోజుల తరువాత న్యూజిలాండ్‌లో మంగళవారం ఒక కొత్త కరోనా కేసు నమోదైంది. దీంతో అక్కడ మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 22వద్ద ఉంది. మెల్బోర్న్ నుంచి జూలై 30న న్యూజిలాండ్‌కు వచ్చిన 20 ఏండ్ల వ్యక్తికి మంగళవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ ఆష్లే బ్లూమిఫీల్డ్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆ వ్యక్తి గ్రాండ్ మిలీనియంలో ఒంటరిగా నివాసముంటున్నాడు. అతను అక్కడ నివిసించిన మూడో రోజు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని,

కానీ తొమ్మిది రోజుల నుంచి అతడికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఇప్పుడు ఆక్లాండ్ క్వారంటైన్‌ సెంటర్‌కు అతడిని తరలించామని ఆష్లే పేర్కొన్నారు. ఈ ఒక్క కేసుతో ఇప్పటివరకు న్యూజిలాండ్‌లో నమోదైన కేసుల సంఖ్య 1,220కు చేరింది. సుమారు 101 రోజుల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో తాము పూర్తిగా కోలుకున్నట్లు భావించామని, మంగళవారం ఒక్క కేసు నమోదు అయినా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు వెంటనే వ్యక్తిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందజేస్తున్నామని ఆష్లే తెలిపారు.

Tags :

Advertisement