Advertisement

  • రష్యాలో 21,000 టన్నుల భారీ ఆయిల్ ట్యాంకర్ కూలిపోయింది

రష్యాలో 21,000 టన్నుల భారీ ఆయిల్ ట్యాంకర్ కూలిపోయింది

By: chandrasekar Mon, 08 June 2020 8:09 PM

రష్యాలో 21,000 టన్నుల భారీ ఆయిల్ ట్యాంకర్ కూలిపోయింది


రష్యాలో భారీ ఆయిల్ ట్యాంకర్ కూలిపోయి, 135 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఆయిల్ వ్యాపించింది. ఆర్కిటిక్ సర్కిల్‌లో 21,000 టన్నుల డీజిల్ సామర్థ్యం ఉన్న ట్యాంకర్ కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. రష్యా సహజవనరుల సంరక్షణ పర్యవేక్షణ విభాగం రాస్‌ప్రిరోడ్‌నజర్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆరు వేల టన్నుల ఆయిల్ భూమిలోనూ, 15,000 టన్నులు నీటిలో కలిసిపోయింది.

అంబర్‌నయ, దలద్యాకన్ నదులు, వాటి ఉపనదుల్లోకి భారీగా ఆయిల్ చేరింది. ట్యాంకర్‌లో ఆయిల్ చేరడంతో అంబర్‌నయ నది ఎర్రగా మారిపోయింది. ఈ ఘటనతో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది. మంత్రి యెవెజనీవ్ జినిచెవ్ సూచనలతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫెడరల్ స్థాయి అత్యవసర పాలనకు అంగీకరించారు.

ఈ ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేసినట్టు అధ్యక్షుడు పుతిన్ వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదం నుంచి కోలుకోడానికి ఏళ్లు పడుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గత నెల చివరిలో సైబైరియా నోరల్సిక్ నగరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నట్టు వివరించారు. థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఆయిల్ ట్యాంకర్‌లో లీకేజీ జరిగింది.

Tags :
|

Advertisement