Advertisement

  • పెళ్లి అయిన 5 రోజులకు మరో పెళ్లికి రెడీ అయిన కేటుగాడు...!

పెళ్లి అయిన 5 రోజులకు మరో పెళ్లికి రెడీ అయిన కేటుగాడు...!

By: Anji Mon, 21 Dec 2020 4:10 PM

పెళ్లి అయిన 5 రోజులకు మరో పెళ్లికి రెడీ అయిన కేటుగాడు...!

మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన వ్యక్తి ఐదు రోజుల్లో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ నెల 2న ఖండ్వాలో ఒక మహిళతో వివాహం జరిగింది.

తరువాతి ఐదు రోజులకే అనగా డిసెంబర్ 7వ తేదీన మోవ్ పట్టణానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

డిసెంబర్ 7వ తేదీన మోవ్లో నిందితుని వివాహ వేడుకకు హాజరైన మొదట పెళ్లితరపు వారు ఒకరు ఫోటోలు తీసి బంధువులకు పంపడంతో వారు అప్రమత్తమయ్యారు.

వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న రెండో వధువు కుటుంబ సభ్యులు సైతం నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు.

పెళ్లైన రెండో రోజే భోపాల్లో అత్యవసర పనిమీద వెళ్తున్నానంటూ నమ్మించిన నిందితుడు.. తాపీగా రెండో పెళ్లి చేసుకున్నాడు.

తమవద్ద రూ.10లక్షలతో పాటు.. ఇంటిసామాగ్రిని కట్నంగా తీసుకున్నాడని మొదటి పెళ్లివారు వాపోయారు. డిసెంబర్ 7తర్వాత మొబైల్ స్విచాఫ్ చేశాడని నిందితుని కోసం గాలిస్తున్నామని ఖండ్వా ఇన్స్పెక్టర్ మండోలి తెలిపారు.

Tags :

Advertisement