Advertisement

  • కొడుక్కి నిద్ర మాత్రలిచ్చి... కోడలితో మామ రాసలీలలు

కొడుక్కి నిద్ర మాత్రలిచ్చి... కోడలితో మామ రాసలీలలు

By: Anji Sun, 20 Sept 2020 11:53 AM

కొడుక్కి నిద్ర మాత్రలిచ్చి... కోడలితో మామ రాసలీలలు

తమ రాసలీలల కోసం ఏకంగా ఇంటి నుంచి పారిపోయిన ఈ ఘటన హరియాణాలో వెలుగులోకి వచ్చింది. పడక సుఖం కోసం బంధాలను ఎగతాలి చేస్తున్నారు కొందరు దుర్మార్గులు. వావీ వరసలు మరచి దారుణాలకు తెగబడుతున్నారు. కుటుంబ సభ్యులతోనే అక్రమ సంబంధాలు పెట్టుకుని బజారున పడుతున్నారు. కూతురిలా చూసుకోవాల్సిన కొడుకు భార్యతో కామకోరికలు తీర్చుకుంటున్న మామ బాగోతం తాజాగా బయటపడింది.

పానిపట్‌కి చెందిన ఓ వ్యక్తి సొంత కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కూతురిలా చూసుకోవాల్సిన కోడలితో కామకోరికలు తీర్చుకునేవాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా రాసలీలీలు సాగించారు. తమ అక్రమ సంబంధానికి కుటుంబం అడ్డుగా ఉందని భావించి నీచానికి పాల్పడ్డారు.

ఏకంగా ఇంటి నుంచి లేచిపోయారు. కోడలు తన పది నెలల బిడ్డతో సహా మామతో వెళ్లిపోయింది. ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్న మామా కోడలు ఆ రోజు రాత్రి భోజనంలో నిద్రమాత్రలు కలిపారు. కొడుకుతో సహా కుటుంబ సభ్యులకు తినిపించి వారంతా నిద్రలోకి జారుకున్నాక ఇంటి నుంచి పరారయ్యారు.

నిద్రలేచాక మామాకోడలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు చుట్టుపక్కల సీసీకెమెరాల ఫుటేజీ పరిశీలించడంతో మామాకోడలు పరారవుతున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Tags :

Advertisement