Advertisement

తెలంగాణలో పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు

By: chandrasekar Thu, 23 July 2020 11:03 AM

తెలంగాణలో పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు


తాజాగా బుధవారం రాష్ట్రంలో 1,554 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 842 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 49,259 కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ తొమ్మిది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 438కి చేరింది.

ఇవాళ 1,281 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 37,666 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 11,155మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.

బుధవారం 15,882 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,93,077 మందికి టెస్టులు చేసినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొన్నది.


Tags :
|
|

Advertisement