Advertisement

  • దేశంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన

దేశంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన

By: chandrasekar Fri, 02 Oct 2020 7:10 PM

దేశంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన

ప్రపంచమంతా వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూసేది కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం. కొన్ని నెలల్లో వ్యాక్సిన్ రావొచ్చన్న అభిప్రాయం మెజార్టీ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల నుంచి వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మన దేశంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేశారు. అన్ని పనులు అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో ఇండియాలో సమర్థమంతమైన కరోనా వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వస్తుందని గులేరియా పేర్కొన్నారు. వ్యాక్సిన్ సిద్ధం అయిన ప్రారంభ దశలో దేశ జనాభాకు సరిపడే సంఖ్యలో డోసులు అందుబాటులో ఉండవని తెలియచేశారు. వ్యాక్సిన్ సిద్ధమైన అనంతరం దానిని భారీగా తయారు చేయడం, ఎక్కువ మందికి పంపిణీ చేయడం లాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

Tags :
|
|

Advertisement