Advertisement

రెండో టీ20 మ్యాచ్ లో ఓ ఫన్నీ సన్నివేశం

By: chandrasekar Mon, 07 Sept 2020 6:11 PM

రెండో టీ20 మ్యాచ్ లో ఓ ఫన్నీ సన్నివేశం


ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ (40: 33 బంతుల్లో 4x4, 2x6) వికెట్ కోసం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్లైండ్‌గా డీఆర్‌ఎస్ కోరి నవ్వులపాలయ్యాడు. మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 6 వికెట్ల తేడాతో గెలుపొంది.. మూడు టీ20ల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. కానీ.. ఫించ్ వికెట్ కోసం ఇంగ్లాండ్ టీమ్ కోరిన డీఆర్‌‌ఎస్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో జోక్స్‌ వస్తున్నాయి.

ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో అరోన్ ఫించ్ అతి జాగ్రత్తగా ఆడుతూ కనిపించాడు. ఈ క్రమంలో ఓ బంతిని చిన్నపాటి పాదాల కదలికలతో ముందుకు వచ్చిన అరోన్ ఫించ్.. బంతిని చక్కగా బ్యాట్‌కి మిడిల్ చేస్తూ డిఫెన్స్ చేశాడు. కానీ.. బంతి బ్యాట్‌ని తాకే ముందు ఫ్యాడ్‌ని తాకినట్లు భ్రమించిన ఇంగ్లాండ్ టీమ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.

ఫీల్డ్ అంపైర్ ఔటివ్వకపోవడంతో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌, బౌలర్ రషీద్ అభిప్రాయం తీసుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. డీఆర్‌ఎస్ కోరాడు. కానీ రిప్లైలో బంతి నేరుగా వెళ్లి బ్యాట్‌కి అదీ చక్కగా మిడిల్‌లో తాకినట్లు తేలింది. దాంతో.. అంటూ ఇంగ్లాండ్ టీమ్‌పై అభిమానులు సెటైర్లు పేలుస్తున్నారు. వాస్తవానికి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. బ్యాట్స్‌మెన్‌కి దూరంగా ఫీల్డింగ్ చేస్తుండటంతో బంతి గమనంపై అతనికి అంచనా లేకపోవచ్చు. కానీ.. బౌలర్ ఆదిల్ రషీద్, కీపర్ జోస్ బట్లర్ కూడా బంతి నేరుగా వెళ్లి బ్యాట్‌కి మిడిల్‌లో తాకినట్లు గుర్తించలేకపోవడం చాలా ఆసక్తికరమైన విషయం.

Tags :
|
|

Advertisement