Advertisement

  • తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం...పాసులు జారీ చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్

తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం...పాసులు జారీ చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్

By: Sankar Tue, 08 Sept 2020 4:50 PM

తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం...పాసులు జారీ చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్


తెలంగాణాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వున్నాయి. ఇప్పటికే.. చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం రేపింది. అసెంబ్లీలో ఓ ఉద్యోగికి కరోనా సోకింది.

పాసులు జారీ చేసే కౌంటర్ లో పని చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో... అసెంబ్లీ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల్లో ఆందోళన మొదలైంది. ఆ ఉద్యోగి ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాడనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారినే అసెంబ్లీలోకి అనుమతి ఇస్తున్నారు. కాగా.. నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి..

కాగా నేడు జరిగిన సమావేశాలలో భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ముఖ్యమంంత్రి కే చంద్రశేఖరరావు సంబంధిత తీర్మానాన్ని మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార పార్టీకి చెందిన సభ్యులతో పాటు, విపక్ష కాంగ్రెస్‌ సభ్యులు సైతం ప్రసంగించి తీర్మానానికి మద్దతు ప్రకటించారు.

Tags :
|

Advertisement