Advertisement

  • డొనాల్ట్ ట్రంప్ విమానానికి దగ్గరగా ఎగిరిన డ్రోన్

డొనాల్ట్ ట్రంప్ విమానానికి దగ్గరగా ఎగిరిన డ్రోన్

By: chandrasekar Tue, 18 Aug 2020 7:16 PM

డొనాల్ట్ ట్రంప్ విమానానికి దగ్గరగా ఎగిరిన డ్రోన్


డొనాల్ట్ ట్రంప్ విమానానికి దగ్గరగా ఒక డ్రోన్ ఎగిరిన సంఘటన ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ కు త్రుటిలో విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్‌ఫోర్స్1 విమానం ఆదివారం రాత్రి వాషింగ్టన్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఎగురుకుంటూ వచ్చిన ఓ డ్రోన్ ఒకటి విమానానికి అత్యంత సమీపంలోకి వచ్చింది.

అయన విమానం రాత్రి వాషింగ్టన్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో పసుపు, నలుపు రంగులో ఉన్న ఆ డ్రోన్ విమానాన్ని దాదాపు ఢీకొట్టేంత పని చేసిందని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అమెరికా సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :
|
|
|

Advertisement