Advertisement

కోయంబత్తూరు సమీపంలో నాటుబాంబు తిని ఆవు మృతి

By: chandrasekar Wed, 19 Aug 2020 09:54 AM

కోయంబత్తూరు సమీపంలో నాటుబాంబు తిని ఆవు మృతి


కోయంబత్తూరు సమీపంలోని మెట్టుపాలయంలో ఆవు నాటుబాంబుని తిని మృతి చెందింది. కేరళ తరహాలో ఏనుగు మృతి చెందినట్లు తమిళనాడులో మరో ఘటన చోటు చేసుకుంది. నాటుబాంబును తిని ఆవు మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆ ఆవు రెండు రోజులు నరకయాతన అనుభవించింది. ఆవును కాపడటానికి వెటర్నరీ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో మెట్టుపాలయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. తన ఆవు కనిపించడంలేదని ఫిర్యాదు చేస్తే పోలీసులు తననే అనుమానిస్తున్నారని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మొహమ్మద్ జాఫర్‌ అలీ అనే రైతు తన ఆవు రెండు రోజులుగా కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు. ఈలోగా ఊరిబయట ఓ ఆవు కనిపించినట్లు అతడికి సమాచారం అందింది. దాని దగ్గరికి వెళ్లి చూడగా నోటి నిండా గాయాలతో రక్తమోడుతూ తీవ్ర అనారోగ్యానికి గురైనాట్లు గుర్తించాడు.

ఆ వెంటనే ఆవుని చికిత్స నిమిత్తం స్థానిక పశు వైద్యశాలకు తీసుకెళ్లినట్లు రైతు జాఫర్ అలీ తెలిపాడు. చికిత్స తర్వాత ఆవు ఏమాత్రం కోలుకోలేదు. సోమవారం, ఆగస్టు 17 రాత్రి చనిపోయింది. అయితే ఆ ఆవును తానే చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారని జాఫర్ అలీ తెలిపాడు. జింకను వేటాడిన కేసులో పదేళ్ల కిందట తనకు జరినామా విధించారని ఇప్పుడు తన ఆవు మరణానికి కారణమైన వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. ఘటనపై మెట్టుపాలయం అటవీ శాఖ కార్యాలయంలో రైతు జాఫర్‌ అలీ ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

ఈ సంఘటనపై విచారణ చేపట్టినట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్ తెలిపారు. అడవి పందులను చంపడానికి పెట్టిన నాటుబాంబులను ఆవు తిని గాయపడి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. బాంబులు పెట్టిన వేటగాళ్లను గుర్తించే పనిలో వెతకడం ప్రారంభించారు. కర్ణాటకలోని మైసూరులోనూ గత నెలలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. హెచ్‌డీ కోటే సమీపంలో ఓ రైతుకు చెందిన ఆవు కూడా అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు తిని గాయపడింది. ఇలాంటి విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :
|
|

Advertisement