Advertisement

ధోనీలో ఉన్న మల్టీ ట్యాలెంట్ ను చూసే అవకాశం...

By: chandrasekar Mon, 31 Aug 2020 7:45 PM

ధోనీలో ఉన్న మల్టీ ట్యాలెంట్ ను చూసే అవకాశం...


ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మాజీ కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఆర్పి సింగ్, పియుష్ చావ్లా కోసం పానీపురి వాలాగా అవతారం ఎత్తాడు. దానికి సంబంధించిన ఈ వీడియో ఇప్పటిది కాదు. ఫిబ్రవరి నాటిది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని ఒక ఈవెంట్ లో భాగంగా మాల్దీవ్స్ వెళ్లినప్పుడు తన టీమ్ సభ్యులకు పానీపూరి అందించాడు. ఇటీవలే ఇద్దరు చెన్నై ఆటగాళ్లకు కరోనా సోకింది.

అందువల్ల యూఏఈలో జరగనున్న ఐపిఎల్ సీజన్13కు ముందు వీరు కొంత కాలం ఐసోలేషన్ లో ఉండనున్నారు. ఈ టైమ్ లో ధోనీ పానీపూరి వాలా అవతారం ఎత్తిన వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. ఒక పానీపూరి స్టాండ్ వద్దకు చేరిన టీమ్ ఇండియా ప్లేయర్లకు ధోనీలో ఉన్న మల్టీ ట్యాలెంట్ ను చూసే అవకాశం దొరికింది. మాల్దీవ్స్ నుంచి ఈ వీడియోను మీరు చూడండి దీనిలో రాక్ స్టార్స్ పానీపూరి ఎలా సిద్ధం చేస్తున్నారో చూడండి. మనకు ఇష్టమైన చాట్ మరింత రుచికరంగా మారింది అని పోస్ట్ చేశారు ధోనీ ఫ్యాన్స్.

Tags :
|
|

Advertisement