Advertisement

  • స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి

By: chandrasekar Fri, 21 Aug 2020 09:29 AM

స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి


ఇటీవల్ల విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదానికి గురై కొందరు ప్రాణాలు కోల్పోయారు. స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం ఘటన విషయంలో హీరో రామ్ వరుస ట్వీట్స్‌తో వార్తల్లోకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారితీసిన ఈ అంశంపై విజయవాడ పోలీసు కమిషనర్ శ్రీనివాసులు స్పందిస్తూ పోలీసులకు ఏ కులం ఏ మతం లేదు మాకు అందరూ సమానమే అని అన్నారు. నిందితులు ఎవరైనా పట్టుకుని శిక్షిస్తామని తెలిపారు.

ఈ సంఘటనపై ఎవరో ఏదో కామెంట్ చేశారని స్పందించాల్సిన అవసరం తమకు లేదని పోలీసు కమిషనర్ అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికేవారని అన్నారు. ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు లేకుండా ఆస్పత్రి నిర్వహించారని ఆరోపించారు. ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారించామని చెప్పిన సీపీ, ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ సందేహం ఉన్న అందరికీ నోటీసులు జారీ చేసి విచారిస్తామని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని సీపీ స్పష్టంచేశారు.

అగ్ని ప్రమాదం జరిగిన కేసు విచారణకు కొంతమంది ముద్దాయిలు, అనుమానితులు సరిగ్గా సహకరించడం లేదని సీపీ శ్రీనివాసులు తెలియజేసారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్ మరియు రమేష్ ఆసుపత్రి యాజమాన్యాల మధ్య ఎటువంటి ఒప్పందం జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. ఆసుపత్రిలో చేరిన రోగుల నుండి చికిత్స కోసం అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారని తమ విచారణలో తేలిందని వివరించారు.

దుర్ఘటన జరిగిన స్వర్ణ ప్యాలెస్ లో అన్యాయంగా పది మంది చనిపోయారని అందులోనూ వారిలో ఎనిమిది మందికి కరోనా నెగిటివ్ అని తేలిందని పేర్కొన్నారు. ఈ కేసులో కీలక వ్యక్తుల సమాచారం అందించిన వారికి లక్ష రూపాయలు నగదు బహుమతి అందిస్తామని సీపీ ప్రకటించారు.

Tags :

Advertisement