Advertisement

  • ప్రారంభానికి ముందే మళ్ళీ ఒక వంతెన కొట్టుకుపోయింది.

ప్రారంభానికి ముందే మళ్ళీ ఒక వంతెన కొట్టుకుపోయింది.

By: chandrasekar Sat, 19 Sept 2020 1:32 PM

ప్రారంభానికి ముందే మళ్ళీ ఒక వంతెన కొట్టుకుపోయింది.


బీహార్ రాష్ట్రంలో గోబరి గ్రామంలో కంకై నదిపై ఒక వంతెనను నిర్మించారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదిలో నీటి మట్టం బాగా పెరిగింది. దీంతో నీటి ప్రవాహం వల్ల కొత్తగా నిర్మించిన వంతెనలో కొంత భాగం కొట్టుకుపోయింది.

ఈ నేపథ్యంలో ప్రారంభానికి ముందే బ్రిడ్జి కొట్టుకుపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. వంతెనను కాంట్రాక్టర్ సరిగా నిర్మించలేదని ఆరోపిస్తున్నారు. బీహార్‌లోని కోసి నదిపై నిర్మించిన మెగా రైల్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.

కాగా ఈ రోజునే రాష్ట్రంలో నిర్మించిన మరో వంతెన కొట్టుకుపోవడం గమనార్హం. బీహార్‌తోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తయిన కొన్ని వంతెనలు ప్రారంభం కాకముందే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయాయి.

Tags :
|
|
|

Advertisement