Advertisement

  • సుమారు రూ.28 కోట్ల విలువైన వస్తువులను ఒంటి చేత్తో దోచేసిన 63 ఏళ్ల మహీళ

సుమారు రూ.28 కోట్ల విలువైన వస్తువులను ఒంటి చేత్తో దోచేసిన 63 ఏళ్ల మహీళ

By: chandrasekar Wed, 07 Oct 2020 7:15 PM

సుమారు రూ.28 కోట్ల విలువైన వస్తువులను ఒంటి చేత్తో దోచేసిన 63 ఏళ్ల మహీళ

ఓ మహీళ సరదా కోసమే దొంగతనాలు మొదలెట్టింది. చివరికి దాన్ని బిజినెస్‌గా మార్చుకుని సెక్యూరిటీ కెమేరాలను సైతం పనిచేయకుండా చేసి వస్తువులు కొట్టేయడం మొదలెట్టింది.

టెక్సాస్‌ చెందిన ఆ ఘరానా లేడీ దొంగ పేరు కిమ్ రిచర్డ్‌సన్. వయస్సు 63 ఏళ్లు కానీ, ఈ కళలో 23 ఏళ్ల యువతిలా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. అమెరికాలోని దాదాపు చాలా స్టోర్లను ఈమె దోచేసింది. 2000 సంవత్సరం ఆగస్టు నుంచి 2019 ఏప్రిల్ నెల వరకు ఆమె విజయవంతంగా దొంగతనాలు చేసింది. సుమారు 3.8 మిలియన్ డాలర్ల (సుమారు రూ.28 కోట్లు) విలువైన వస్తువులను ఒంటి చేత్తో దోచేసింది. ఇందుకు సెక్యూరిటీ పరికరాలను పనిచేయకుండా చేసే పరికరాలను ఉపయోగించి ఈ దొంగతనాలు చేసేది.

అలా దొంగిలించిన వస్తువులను ఆమె eBay ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మేసేది. ఇలా ఆమె ‘దొంగ’ బిజినెస్ మూడు దొంగతనాలు ఆరింతల లాభంగా జరిగేది. కానీ, చేసిన పాపం ఏదో ఒక రోజు వెంటాడుతుందన్నట్లు.. ఓ రోజు ఆమె చోరీని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 54 నెలల జైలు శిక్ష (సుమారు 4.5 ఏళ్లు) విధించింది. ఈ సందర్భంగా ఆమె ఆ దొంగ వస్తువులతో సంపాదించిన మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించేందుకు అంగీకరించింది.

Tags :

Advertisement