Advertisement

బ్రెజిల్‌లో 98,493 కరోనా మరణాలు

By: chandrasekar Sat, 08 Aug 2020 11:05 AM

బ్రెజిల్‌లో  98,493  కరోనా మరణాలు


బ్రెజిల్‌లో రోజు రోజుకి కరోనా విజృంభణ పెరుగుతూనే ఉంది. నిత్యం ఆ దేశంలో వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 29,12,212 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 98,493 మంది మృతి చెందారని జాతీయ ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.

గురువారం ఒక్కరోజే ఆ దేశంలో కొత్త 57,152 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 1,437 మంది తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా మృతి చెందారు. అమెరికాలో ఇప్పటివరకు 4.8 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా సుమారు 3మిలియన్ల కేసులతో బ్రెజిల్ రెండోస్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న కరోనా వైరస్‌ను మహమ్మారిగా ప్రకటించింది. నాటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 18.9 మిలియన్ల మంది వైరస్ బారినపడ్డారని, 7 లక్షల 12 వేల మంది మరణించారని అమెరికాకు చెందిన జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

Tags :
|
|
|
|

Advertisement