Advertisement

  • ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 976 కరోనా కేసులు నమోదు..!

ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 976 కరోనా కేసులు నమోదు..!

By: Anji Fri, 28 Aug 2020 07:07 AM

ప్రకాశం జిల్లాలో తాజాగా మరో 976 కరోనా కేసులు నమోదు..!

ప్రకాశం జిల్లాలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. తాజాగా మరో 976 నమోదు అయ్యాయి. దీంతో జిల్లా ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,624కి చేరింది. ఒంగోలులో అత్యధికంగా 314 కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు.

జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 261 మంది మృతి చెందారు. నిన్న కరోనా నుండి కోలుకుని 106 మంది డిశ్చార్జ్ అయ్యారు. 108 మందిని హోం ఐసోలేషన్‌కు పంపారు. జిల్లాలో ప్రస్తుతం 2078 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తానికి ఈ కరోనా మహమ్మారికి సరైన వ్యాక్సిన్ వచ్చేవరకు కరోనా కంట్రోల్ లోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు.

Tags :

Advertisement