Advertisement

  • ప్రశాంతంగా ముగిసిన నీట్ ..తెలంగాణాలో 94 శాతం మంది హాజరు

ప్రశాంతంగా ముగిసిన నీట్ ..తెలంగాణాలో 94 శాతం మంది హాజరు

By: Sankar Mon, 14 Sept 2020 09:35 AM

ప్రశాంతంగా ముగిసిన నీట్ ..తెలంగాణాలో 94 శాతం మంది హాజరు


ఎట్టకేలకు ‘నీట్‌’పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వైద్య కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన పరీక్ష తెలంగాణలో కట్టుదిట్టంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగితే, ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను విడతల వారీగా అనుమతించారు.

అన్ని కేంద్రాల్లోనూ థర్మల్‌ గన్స్‌ను పెట్టారు. జ్వరం చూసిన తర్వాతే వారిని లోనికి అనుమతించారు. జ్వరం ఉన్నవారికి, కరోనా లక్షణాలున్న వారికి ఐసోలేషన్‌ గదిలో పరీక్ష నిర్వహించారు. గతంలో ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులకుసీటింగ్‌ ఏర్పాట్లు చేస్తే, ఈసారి 12 మందినే కూర్చోబెట్టారు. దీనిద్వారా ఒక్కో బెంచీకి ఒక్క విద్యార్థే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ ఏడాది తెలంగాణ నుంచి 55,800 మంది విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. హైదారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో 112 నీట్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 94 శాతం మంది విద్యార్థులు ‘నీట్‌’పరీక్షకు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. నీట్‌ పరీక్షా పేపర్‌ ఈసారి మోడరేట్‌ నుంచి సులువుగా ఉందని చాలామంది విద్యార్థులు అంటున్నారు.

గతేడాది కంటే ఈ ఏడాది పేపర్‌ చాలా ఈజీగా ఉందని చెబుతున్నారు. 99 శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ నుంచే వచ్చాయి. కెమిస్ట్రీలోని రెండు మూడు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. ఒకే ప్రశ్నకు ఇచ్చిన జవాబులు దగ్గరగా ఉన్నాయి. బయాలజీలోని నాలుగైదు ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.

Tags :

Advertisement