Advertisement

తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు...

By: chandrasekar Tue, 24 Nov 2020 5:33 PM

తెలంగాణలో కొత్తగా 921 కరోనా కేసులు...


తెలంగాణలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం 600 నమోదైన కేసులు.. సోమవారం మళ్లీ 1000 కి చేరువలో నమోదయ్యాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 921 కరోనా కేసులు నమోదు కాగా ఈ మహమ్మారితో నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,65,049 కి చేరగా.. మరణాల సంఖ్య 1,437 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 1,097 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,52,565 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 8,720 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.28 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ఇదిలావుంటే.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 42,740 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 23వ తేదీ వరకు మొత్తం 51,58,474 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ పరిధిలో 146 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement