Advertisement

  • తెలంగాణాలో కరోనా విలయ తాండవం ..ఒక్కరోజే 920 కేసులు ..అన్ని జిల్లాలకు పాకుతున్న కరోనా

తెలంగాణాలో కరోనా విలయ తాండవం ..ఒక్కరోజే 920 కేసులు ..అన్ని జిల్లాలకు పాకుతున్న కరోనా

By: Sankar Fri, 26 June 2020 10:39 AM

తెలంగాణాలో కరోనా విలయ తాండవం ..ఒక్కరోజే 920 కేసులు ..అన్ని జిల్లాలకు పాకుతున్న కరోనా



తెలంగాణాలో రోజు రోజుకు కరోనా కేసులు విలయ తాండవం చేస్తున్నాయి ..ఒకరోజుకి మించి ఇంకోరోజు కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..తాజాగా కరోనా కేసులు వెయ్యి దగ్గరకు చేరుతున్నాయి.. నిన్నమొత్తం 920 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,364కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 6,446గా ఉన్నాయి.

గత 24 గంటల్లో 327 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 4,688కు చేరింది. ఇక బుధవారం మరో ఐదుగురు వ్యక్తులు కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 230కి చేరింది.ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే భారీగా రికార్డు స్థాయిలో 737 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 86 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 60 కొత్త కరోనా కేసులను గుర్తించారు.

ఇక కరీంనగర్‌లో 13 కరోనా కేసులు బయటపడ్డాయి. రాజన్న సిరిసిల్లలో 4, మహబూబ్‌నగర్‌లో 3, నల్గొండలో 3, మెదక్‌, వరంగల్ అర్బన్, ములుగులో 2 కేసులు గుర్తించారు. వరంగల్ రూరల్, కామారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కోకేసు నమోదయ్యాయి.మరోవైపు, తెలంగాణలో గురువారం 3616 కరోనా టెస్టులు చేశారు. వీటిలో నుంచే 920 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ కరోనా టెస్టుల సంఖ్య 70,934కు చేరింది.

Tags :
|
|

Advertisement